![]() |
![]() |

ఆదివారం విత్ స్టార్ మా పరివారం 150 వ ఎపిసోడ్ ప్రోమో భలే ఫన్నీగా ఉంది. ఈ షోకి వచ్చిన గెస్టులను వెరైటీగా ఇంట్రడ్యూస్ చేస్తూ వాళ్ళ మెడల్లో నిమ్మకాయల దండలు వేసి సన్మానం చేశారు అవినాష్ - హరి. "ఆవిడ వచ్చిన ఎపిసోడ్ లు 18 " అని చెప్తూ అవినాష్ ఆ పేపర్ ని చింపి పారేసాడు. "ప్రేరణ..ఇదీ ఒక పేరేనా" అన్నాడు అవినాష్. దానికి ప్రేరణ నీరసంగా చూసింది అవినాష్ వైపు. "ఇతని పేరు అవినాష్. త్వరలో ఇతను పెట్టబోతున్నాడు ఒక పెద్ద కార్ వాష్" అంటూ అవినాష్ గురించి చెప్పాడు ఇమ్మానుయేల్. "ఆవిడ మామగారు సీరియల్ లో కనిపించిన ఎపిసోడ్స్ కన్నా పరివారంలో కనిపించిన ఎపిసోడ్స్ ఎక్కువా" అంటూ సుహాసినిని ఇంట్రడ్యూస్ చేసాడు హరి. దాంతో సుహాసిని టవల్ తో మొహాన్ని దాచుకుంది. "కృతిక ఎంత అందంగా రెడీ అయ్యి ఎపిసోడ్ కి వస్తుందో ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు కూడా అంతే అందంగా ఉంటుంది" అంటూ కృతిక గురించి హరి ఇంట్రడ్యూస్ చేసేసరికి కృతికి ముఖాన్ని దాచుకుని మరీ నవ్వుకుంది.
"అర్జున్ చాలా మంచివాడు. ఈరోజు పరివారంలో ఒక ఆర్టిస్ట్ తక్కువయ్యారు అని మేనేజర్ ఫోన్ చెయ్యగానే నేనున్నాను మీకు" అంటూ వస్తాడు. అని చెప్పాడు. "ఆయన చేసిన ఎపిసోడ్లు 30 ..అతని వయసు 40 " అంటూ అమరదీప్ గురించి చెప్పారు అవినాష్, హరి. "ఏది ఏమైనా తొందరలోనే మీరు మా అయ్యగారు కావాలని మనసారా కోరుకుంటూ " అంటూ బాలు గురించి ప్రత్యేకంగా చెప్పారు అవినాష్ - హరి. ఇంతలో శ్రీముఖి వచ్చి బాలు మేడలో ఒక దండ వేసింది. అలాగే బాలు కూడా శ్రీముఖి మేడలో నిమ్మకాయల దండ వేసాడు. దాంతో శ్రీముఖి సిగ్గుపడుతూ నవ్వుకుంది.
![]() |
![]() |